కూలీలుగా మంత్రులు
వరంగల్‌లో నిర్వహించే టీఆర్‌ఎస్ 16వ వార్షికోత్సవ సభ తొవ్వఖర్చుల కోసం బుధవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూలి పనులు చేసి డబ్బు సంపాదించారు. వరంగల్ దేశాయిపేటరోడ్డులోని ఒయాసిస్ హైస్కూల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి టెన్త్ విద్యార్థులకు తెలుగు ఛందస్సు క్లాస్ చెప్పి రూ.లక్ష సంపాదించారు. కామారెడ్డి జిల్లాలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే హన్మం త్ షిండే, జెడ్పీ చైర్మన్ దఫేదార్‌రాజుతో కలిసి కూలి పనులు చేసి రూ.5.5 లక్షలు సంపాదించారు.వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బీ వినోద్ పనిచేసి రూ.1,61,116 సంపాదించారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి రూ.6.27 లక్షలు సంపాదించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి లకా్ష్మరెడ్డి రూ.50 వేలు, వనపర్తిలో ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రూ.2 లక్షలు, సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి రూ.56 వేలు, సంగారెడ్డి జిల్లాలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి రూ.4 లక్షలు సంపాదిం చారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








